శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (13:31 IST)

సీన్‌ రివర్స్.. 14ఏళ్ల బాలుడిపై 40ఏళ్ల మహిళ అత్యాచారయత్నం.. ఇంట్లోకి పిలిచి?

దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరగని రోజంటూ లేదంటే నమ్మితీరాల్సిందే. కానీ విజయవాడలో సీన్ రివర్స్ అయింది. 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల ఓ వివాహిత లైంగిక దాడికి

దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరగని రోజంటూ లేదంటే నమ్మితీరాల్సిందే. కానీ విజయవాడలో సీన్ రివర్స్ అయింది. 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల ఓ వివాహిత లైంగిక దాడికి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికంగా వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల యువకుడిని  40 ఏళ్ల వివాహిత తన ఇంట్లోకి పిలిచింది. ఆపై అత్యాచారయత్నం చేసింది.
 
శుక్రవారం సాయంత్రం నగరంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కంగారు పడిపోయిన బాధిత బాలుడు ఇంటికెళ్లి అతని తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని తెలిపాడు. ఆపై బాధిత బాలుడి తల్లిదండ్రులు వివాహితపై చేజేసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు  ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
మైనర్ బాలబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. వైద్య పరీక్షల కోసం బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు 15 రోజుల రిమాండ్ విధించింది.