సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (13:31 IST)

కామాంధుడి ఉచ్చులో మరో మహిళా టెక్కీ

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. కామాంధుడి ఉచ్చులో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలైపోయింది. హైదరాబాద్ నగరంలోని మయూర్ పాన్ హౌస్ యజమాని అయిన ఉపేందర్ వర్మ, ఫేస్‍బుక్ రిక్వెస్ట్స్ పంపి అమ్మాయిలను ట్రాప్ చేస

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. కామాంధుడి ఉచ్చులో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలైపోయింది. హైదరాబాద్ నగరంలోని మయూర్ పాన్ హౌస్ యజమాని అయిన ఉపేందర్ వర్మ, ఫేస్‍బుక్ రిక్వెస్ట్స్ పంపి అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. మంచి మాటలతో అమ్మాయిలను వలలో వేసుకుని స్వీట్ పాన్‌లో మత్తు పానీయాలు కలిపి అమ్మాయిలపై అత్యాచారాలకు ఒడిగడుతూ వచ్చాడు.
 
అంతేకాదు రహస్యంగా వీడియోలు తీసి యూట్యూబ్‌లో వీడియోలో అప్లోడ్ చేస్తానని అని బెదిరించి పలుసార్లు లోబరుచుకునేవాడు. ఉపేంద్ర వర్మ అఘాయిత్యాలకు బలైపోయిన ఓ మహిళ కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారించిన పోలీసులు నిందితుడు ఉపేంద్ర వర్మపై రేప్ కేసుతోపాటు పలు కేసులు నమోదు చేశారు.