శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (15:25 IST)

సెహ్వాగ్‌పై ప్రీతి జింటా విమర్శలు.. కోచ్ బాధ్యతలు వీరూ వద్దనుకున్నాడా?

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణమని ఆ జట్టు యజమాని ప్రీతి జింటా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీ

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణమని ఆ జట్టు యజమాని ప్రీతి జింటా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. 
 
పంజాబ్ జట్టుకు సెహ్వాగ్‍‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జట్టు ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింటా విమర్శలు చేయడంతో వచ్చే ఏడాది జట్టు బాధ్యతలను నుంచి తప్పుకోవాలని సెహ్వాగ్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. 
 
రాజస్థాన్‌తో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో 158 పరుగులను చేధించలేక పరాజయం పాలైంది. ఏ ఒక్కరు జట్టును గెలుపు బాట పట్టించలేక పోయారు. దీంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఓటమితో అసహనానికి గురైన ప్రీతి జింటా.. కోచ్, మెంటర్ అయిన వీరుపై మండిపడిందని, ఓటమికి కారణాలు చెప్పినా ప్రీతి జింటా పదే పదే విమర్శలు చేసిందని.. దీంతో సెహ్వాగ్ జట్టు బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.