సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (10:20 IST)

జైపూర్‌లో భర్త విమానం ఎక్కించాడు.. కానీ శంషాబాద్‌లో మిస్ అయింది ఎలా?

జైపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సాయి ప్రసన్న (28) అనే వివాహిత అదృశ్యమైంది. దీనిపై స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.

జైపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సాయి ప్రసన్న (28) అనే వివాహిత అదృశ్యమైంది. దీనిపై స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.
 
సాయి ప్రసన్నను ఆమె భర్త జైపూర్లో విమానం ఎక్కించి అత్తమామలకు సమాచారం అందించాడు. ప్రసన్నను రిసీవ్ చేసుకోవడానికి తండ్రి, తమ్ముడు ఎయిర్ పోర్ట్‌కు వచ్చారు. అయితే తండ్రి తమ్ముడులకు తెలియకుండా సాయి ప్రసన్న వేరే క్యాబ్ ఎక్కి వెళ్లిపోయింది. కొంతదూరం వెళ్లిన తర్వాత తమ్ముడుకి కాల్ చేసి మాట్లాడి, ఆ తర్వాత స్విచాఫ్ చేసింది.
 
దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, జైపూర్లో ఉన్న సాయి ప్రసన్న భర్తకి విషయం తెలియజేశారు. సాయి ప్రసన్న అదృశ్యం వెనుక ఖమ్మంకి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఉండొచ్చని ఆమె భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజీలే కీలకం కావడంతో ఆదిశగా పోలీసులు చర్యలు చేపట్టారు.