సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (14:00 IST)

ఆడశిశువు పుట్టిందని.. ముళ్లపొదలో పారేశారు.. నాచారంలో?

ఆడశిశువు పుట్టిందని ఆ శిశువు తల్లితండ్రులు పసికందును ముళ్లపాలు చేశారు. ఈ ఘటన నాచారంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నాచారం ఓల్డ్‌విలేజ్‌-బాబానగర్‌ మార్గంలోని మసీదు సమీపంలో నిరుపయోగంగా ఉన్న

ఆడశిశువు పుట్టిందని ఆ శిశువు తల్లితండ్రులు పసికందును ముళ్లపాలు చేశారు. ఈ ఘటన నాచారంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నాచారం ఓల్డ్‌విలేజ్‌-బాబానగర్‌ మార్గంలోని మసీదు సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఇంటి వద్ద ముళ్ల చెట్లలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ శిశువును వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.
 
రంజాన్‌ మాసం కావడంతో ప్రార్థనల కోసం మసీదుకు వస్తున్న మహమ్మద్‌ అహ్మద్‌ అనే వ్యక్తి పాప ఏడుపు విని 100కి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని.. 108 కి ఫోన్ చేసి ఆంబులెన్స్‌ను రప్పించారు. 
 
శరీరం నుంచి రక్తం కారుతున్న స్థితిలో పాపను 108 సిబ్బంది స్థానిక ఆసుపత్రికి, అనంతరం నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప ఒంట్లో నుంచి రక్తం ఎక్కువగా పోవడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును ఎవరు వదిలి వెళ్లారో కనుగొనేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.