1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 2 జూన్ 2018 (15:05 IST)

డేటింగ్ చేస్తున్న యువతితోనే ఆ పని చేయించాడు... పోలీసులకు దొరికిపోయారు...

డేటింగ్. ఇప్పుడు సమాజంలో ఎక్కువగా వినబడుతున్న మాట. యువతీయువకులు పెళ్లి కాకుండా ఎంచక్కా చట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని డేటింగ్ అంటున్నారు. కలిసి వుంటూ అన్నీ కానించేస్తుంటారు. ఇప్పుడు ఇలా డేటింగ్ చేస్తూ ప

డేటింగ్. ఇప్పుడు సమాజంలో ఎక్కువగా వినబడుతున్న మాట. యువతీయువకులు పెళ్లి కాకుండా ఎంచక్కా చట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని డేటింగ్ అంటున్నారు. కలిసి వుంటూ అన్నీ కానించేస్తుంటారు. ఇప్పుడు ఇలా డేటింగ్ చేస్తూ ప్రముఖ సంస్థలో ఫిలిమ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న నవీన్ రెడ్డి అనే వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. భార్య ఇద్దరు పిల్లలున్న నవీన్, మరో మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. 
 
ఈ రోజుల్లో ఒక్క ఫ్యామిలీనే నెట్టుకు రావడం కష్టతరం, అలాంటిది రెండు ఫ్యామిలీలు(డేటింగ్) మెయింటైన్ చేయడం అంటే మామూలు కాదు కదా. అందుకే డేటింగ్ చేస్తున్న యువతిని సాధనంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి సోషల్ మీడియాలో చాటింగ్ మొదలుపెట్టి, అమాయకులను బుట్టలో పడేసి తద్వారా డబ్బులు ఆర్జించాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే వీరికి ఓ బకరా దొరికిపోయాడు. 
 
అతడు ఫోన్ నెంబరు పోస్టు చేయగానే అన్నీ తను డేటింగ్ చేస్తున్న యువతితోనే చాటింగ్ చేయించాడు. తొలుత తనకు అర్జెంటుగా డబ్బులు కావాలనీ, రెండుమూడు రోజుల్లో ఇచ్చేస్తానంటూ నమ్మబలికింది. అతడు సరేనంటూ రూ. 20 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో వేశాడు. ఆ తర్వాత ఎంతకీ ఆ డబ్బులు ఊసెత్తకపోవడంతో సదరు వ్యక్తి తన డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దానితో విజయవాడలో స్థలం అమ్మేందుకు రూ. 2 లక్షలు డబ్బు కావాలనీ, ఆ డబ్బు సర్దితే డబ్బు ఇచ్చేస్తానంటూ మరోసారి బోల్తా కొట్టించింది. ఆమె మాటలను నమ్మిన వ్యక్తి మళ్లీ రూ. 2 లక్షలు బ్యాంకులో జమ చేశాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే అంతేసంగతులు. ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. ఏం చేయాలో తెలీని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.