ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (08:56 IST)

భర్త లారీ డ్రైవర్.. వరుసకు మరిదితో భార్య షికార్లు.. బైకును లారీతో ఢీకొట్టి?

భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతోంది. అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా వివాహేతర సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో వేరొక వ్యక్తితో బైకులో షికార్లు చేస్తూ కనిపించిన భార్యను భర్త లార

భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతోంది. అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా వివాహేతర సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో వేరొక వ్యక్తితో బైకులో షికార్లు చేస్తూ కనిపించిన భార్యను భర్త లారీతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రమణమ్మ-తవిటయ్య దంపతులు. 
 
తవిటయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా నిత్యం లారీపైనే ఉండే తవిటయ్యకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో భార్యకు ఫోన్ చేసి సుభద్రాపురం జంక్షన్‌కు వస్తే డబ్బులిస్తానని చెప్పాడు. భర్తను కలిసేందుకు రమణమ్మ, మరిది వరసైన రామకృష్ణతో కలసి బైక్‌పై సుభద్రాపురం బయలుదేరింది. 
 
వారిద్దరినీ చూసిన తవిటయ్యలో అనుమానం మరింతగా పెరిగింది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన అతడు.. లారీతో వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ  ఘటనలో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.