శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (14:57 IST)

ముంచుకొస్తున్న ముప్పు.. మానవజాతికి మూడనుంది!

భూగోళానికి ముప్పు ముంచుకొస్తోంది. మనుష్య జాతి దుశ్చర్యలతో భూగోళానికి పెను ముప్పు ఏర్పడింది. దీని ఫలితంగా భవిష్యత్‌లో మానవజాతి పూర్తిగా అంతరించిపోనుంది. భూమిపై జీవవైవిధ్యం కొరవడుతుందని, పునరుద్ధరించడాన

భూగోళానికి ముప్పు ముంచుకొస్తోంది. మనుష్య జాతి దుశ్చర్యలతో భూగోళానికి పెను ముప్పు ఏర్పడింది. దీని ఫలితంగా భవిష్యత్‌లో మానవజాతి పూర్తిగా అంతరించిపోనుంది. భూమిపై జీవవైవిధ్యం కొరవడుతుందని, పునరుద్ధరించడానికి అత్యవసరంగా మరిన్ని చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఈ మేరకు 184 దేశాలకు చెందిన 15 వేల మంది శాస్త్రవేత్తలు సంతకాలు చేసిన ఓ లేఖ "వార్నింగ్ టు హ్యుమానిటీ: ఏ సెకండ్" నోటీస్ పేరుతో బయోసైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమైంది. 
 
1992లో పలు దేశాలకు చెందిన 1,700 మంది శాస్త్రవేత్తలు ఇలాంటి హెచ్చరికలే జారీ చేస్తూ అంతర్జాతీయ సమాజానికి వార్నింగ్ టు హ్యుమానిటీ పేరుతో లేఖ రాశారు. భూగోళంపై మానవజాతి మనుగడ కొనసాగాలంటే ప్రకృతివనరుల విధ్వంసాన్ని ఆపాలని సూచించారు. తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రెండో హెచ్చరిక జారీ చేస్తూ లేఖ రాసింది. 
 
1992 నాటితో పోలిస్తే పరిస్థితులు మరింత దిగజారాయని హెచ్చరించారు. జనాభా విస్ఫోటనం ప్రధాన సమస్యగా మారిందని, 1992 తర్వాత రెండున్నర దశాబ్దాల్లో 200 కోట్ల జనాభా పెరిగిందన్నారు. భూతాపం పెరిగిపోతుందని ఫలితంగా ఎవరెస్ట్‌పై మంచు వేగంగా కరుగుతున్నదన్నారు. వ్యవసాయంలో విచ్చలవిడి రసాయనాల సాగు, అడవుల నరికివేత, జల కాలుష్యం ప్రధాన సమస్యలుగా పరిణమించాయన్నారు. 
 
జలవనరుల్లో జీవజాతులు అంతరిస్తున్నాయని, సముద్రాలు నిర్జీవంగా మారుతున్నాయని వివరించారు. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా మండించడంతో వాతావరణంలోకి గ్రీన్‌హౌజ్ వాయువులు చేరి ముప్పుగా పరిణమిస్తున్నాయని, మన ఇంటికి మనమే నిప్పు అంటించుకుంటున్నామని హెచ్చరించారు.