గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (08:53 IST)

అమెరికాపై అణు దాడికి ఉత్తర కొరియా సమాయత్తం...

అమెరికాపై అణుదాడికి ఉత్తర కొరియా సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 11 రోజుల పాటు ఆసియా దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో ఉండగానే ఉత్తర కొర

అమెరికాపై అణుదాడికి ఉత్తర కొరియా సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 11 రోజుల పాటు ఆసియా దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో ఉండగానే ఉత్తర కొరియా అణు దాడికి తెగబడవచ్చని సమాచారం. 
 
ట్రంప్ తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన పర్యటన సందర్భంగా అణుదాడి జరిగే అవకాశం ఉందని వైట్‌హౌస్‌లో ఆసియా - పసిఫిక్ సెక్యూరిటీ ప్రొగ్రామ్ డైరెక్టర్ పాట్రిక్ క్రొనిన్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ట్రంప్ జపాన్, దక్షిణకొరియా పర్యటిస్తున్న సమయంలో ఉత్తరకొరియా అణుబాంబును ప్రయోగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
 
దీంతో ఉత్తరకొరియా చర్యలపై నిఘా పెంచినట్టు ఆయన తెలిపారు. ఉత్తరకొరియా చేయబోయే దాడికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే, ఫెడరేషన్ ఆఫ్ అమెరికా శాస్త్రవేత్త ఆడం మౌంట్ మాట్లాడుతూ, ట్రంప్ జపాన్, దక్షిణకొరియాలో ఉన్న సమయంలో ఉత్తరకొరియా మరో అణుపరీక్షను నిర్వహించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో అమెరికా రక్షణ అధికారులు అప్రమత్తమయ్యారు.