గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 నవంబరు 2025 (19:37 IST)

నాగుపాము పిల్లపై బైక్ పోనిచ్చాడు, చటుక్కున కాటేసింది (video)

Snake bite
పరిసర ప్రాంతాలలో కొన్నిసార్లు పాములు తిరుగుతూ వుంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా గమనిస్తూ వుండాలి. సోషల్ మీడియా X లో ఓ వీడియో షేర్ అయ్యింది. అందులో ఓ చిన్న నాగుపాము పిల్ల బైక్ నడిపే వ్యక్తిని ఎలా కాటు వేసిందో, పిల్లపాము అయినా అది ఎంత ప్రమాదకరమైనదో కనబడుతోంది.
 
ఓ బైకర్ వాహనాన్ని నడుపుతూ వచ్చాడు. అలా వస్తున్న క్రమంలో నేలపై పాకుతూ వెళ్తున్న పిల్ల నాగుపామును చూడలేదు. వాహన చక్రాన్ని దాని పైకి ఎక్కించాడు. అంతే.. వెంటనే అది పడగ విప్పి కాటు వేసేందుకు దూకింది. ఐతే ఇంటి గేటు వేసి వుండటంతో బైకర్ తన వాహనాన్ని వెనక్కి జరుపుతూ కాలు కింద పెట్టాడు. అంతే.... ఆ పిల్ల నాగుపాము అతడి కాలుపై కాటు వేసింది. కాలు వద్ద ఏదో చురుక్కుమనడంతో అతడు కిందకు చూసాడు. అతడి కాలు వద్ద కాటు వేసిన పిల్లపామును చూసి బైక్ కిందపడేసి దూకేసాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది వీడియోలో తెలుపలేదు.