సంబంధిత వార్తలు
- సూట్‌కేసులో బతికిన శవం : ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఓ మిత్రుడి ఐడియా
- ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కష్టాలు చెప్పతరమా? ఎక్కడ?
- ఆశ్చర్యపోయిన పోలీసులు... : భిక్షగాడి సామాజికదూరం... వీడియో వైరల్
- సొంతూరుకు వెళ్ళేందుకు శవం గెటప్... సినీ ఫక్కీలో ప్రయాణం.. చివరకు..
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
ఇంట్లో మద్యం తయారు చేసుకోవడం ఎలా? గూగుల్‌లో శోధిస్తున్న నెటిజన్లు
లాక్‌డౌన్ కారణంగా మద్యంతో పాటు అన్నీ బంద్ అయ్యాయి. కేవలం అత్యవసర సేవలు మినహా ఇతరాలేమీ అందుబాటులో లేవు. ముఖ్యంగా మద్యంబాబులు పిచ్చివాళ్లుగా మారిపోతున్నారు. గుక్కెడు మద్యం కోసం తల్లడిల్లిపోతున్నారు. నల్ల మార్కెట్‌లో పలుకుతున్న ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
మరోవైపు బ్లాక్‌లో మందు దొరుకుతున్నప్పటికీ... దాని ధర చుక్కలను తాకుతోంది. హైదరాబాదులో క్వార్టర్ రూ.140 ఉండే లిక్కర్‌ను బ్లాక్‌లో రూ.750కి అమ్ముతున్నారు. బీరు రూ.400-450 మధ్యలో లభిస్తోంది. ఒక వేళ కొందామని డబ్బు రెడీ చేసుకున్నా.. అది చేతి వరకు వస్తుందో? లేదో? అనే డౌట్. ఈ పరిస్థితి దేశ వ్యాప్తంగా నెలకొనివుంది.
దీంతో ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు... సొంతంగా మందు తయారు చేసుకుంటే పోలా? అని మందుబాబులు ఆలోచిస్తున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా గూగుల్‌లో 'ఇంటి వద్ద ఆల్కహాల్ తయారు చేయడం ఎలా?' అని వెతుకుతున్నారు. మార్చ్ 22 నుంచి 28 వరకు ఆన్‌లైన్ సర్చింగులో ఇదే టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
తర్వాతి కథనం
