సంబంధిత వార్తలు
- ఎన్టీఆర్ అరవింద సమేత టీజర్ రిలీజ్ డేట్ ఇదే..!
- సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ తర్వాత కాజల్ అగర్వాల్.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో..?
- చికాగో వ్యభిచార దందాతో నాకు లింకుందా? రెజీనా స్పందన
- ట్వంటీ20 సిరీస్ : రోహిత్ వీరకొట్టుడు.. ఇంగ్లీష్ బౌలర్లు బెంబేలు
- సోమవారం (09-07-2018) దినఫలాలు - స్త్రీలకు తల, నరాలకు సంబంధించి...
నన్ను శిలువపై ఉరి తీయాలన్నది ఎన్డీయే ప్లాన్ : విజయ్ మాల్యా
దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. ఈయనగారు ఇపుడు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా మాట్లాడుతున్నారు. బ్యా
దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. ఈయనగారు ఇపుడు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా మాట్లాడుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం మానేసి... కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు.
విజయ్ మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం... ఆయనను తమకు అప్పగించాలంటూ బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. పైగా, బ్రిటన్‌లో ఉన్న మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం తనను వాడుకోవాలని ఎన్డీయే చూస్తోందని... తనను భారత్‌కు రప్పించి, శిలువపై ఉరి తీస్తే ఓట్లు రాలతాయని భావిస్తోందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం భారత ప్రభుత్వం తనను వెంటాడుతోందన్నారు.
ఎప్పుడో తన తండ్రి తనకు రాసిచ్చిన ఆస్తులను కూడా తీసేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమ తీసుకుని తమరు తన వద్దకు రావడమెందుకని... తానే వచ్చి ఆస్తులను అందజేస్తానని బ్రిటీష్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులకు తాను చెప్పానని తెలిపారు.
బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం... రూ.13,900 కోట్ల విలువైన తన ఆస్తులను కుదువపెట్టానని... బ్యాంకులతో ఉన్న లావాదేవీలన్నింటినీ పూర్తి చేస్తానని వెల్లడించారు.
