శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (11:38 IST)

సహజీవనం.. నిశ్చితార్థం... ఆ తర్వాత శీలం లేనిదానివంటూ నిందలు...

వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. నాలుగేళ్ళ పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. తీరా పెళ్లి ముహుర్తం దగ్గరపడే సమయానికి వరుడు పత్తాలేక

వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. నాలుగేళ్ళ పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. తీరా పెళ్లి ముహుర్తం దగ్గరపడే సమయానికి వరుడు పత్తాలేకుండా పోయాడు. గుంటూరులో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన యువతీ యువకులు ఒకేచోట కలిసి చదువుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆపై గుడిలో దండలు మార్చుకుని పెళ్ళి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ సుమారు నాలుగేళ్ళు సహజీవనం చేశారు. 
 
ఈ విషయం ఇరు కుటుంబాల్లోని సభ్యులెవ్వరికీ తెలియదు. దీంతో వారిద్దరికీ పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ యువతి ఇంట నిశ్చితార్ధం నిర్వహించారు. ఆగస్టులో పెళ్ళి చేయాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలో వర్షాలు పడతాయని, డిసెంబరులో చేసుకుంటానని ప్రియుడు చెప్పాడు. నిజమేనని నమ్మిన యువతి కుటుంబ సభ్యులు డిసెంబరు వరకు ఎదురు చూశారు. 
 
తీరా పెళ్ళి సమయానికి వెళ్ళి అడిగితే... నీతో నాకు సంబంధం లేదు, నీవు మంచిదానివి కాదంటూ ప్రియుడు నిందలు వేశాడు. ఆ యువకుడిని మందలించి వివాహం జరిపించాల్సిన బాధ్యత కలిగిన అతడి తల్లిదండ్రులు కొడుకునే వెనకేసుకొచ్చారు. మా అబ్బాయికి ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయి దొరికిందనీ, పెళ్ళి చేయబోతున్నామనీ చెప్పారు.
 
దీంతో ఉలిక్కిపడిన బాధితురాలు ఎట్టకేలకు తన ప్రియుడితో పెళ్ళి సంబంధం కుదుర్చుకున్న అమ్మాయి అడ్రస్‌ కనుక్కుని వెళ్ళి అసలు విషయం చెప్పింది. ఆ పెళ్ళి ఆగిపోయింది. తనను పెళ్ళి చేసుకోవాలని బాధితురాలు ప్రాధేయపడుతున్నా ప్రియుడు, అతడి కుటుంబ సభ్యులు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.