శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జులై 2018 (08:44 IST)

గొంతు గట్టిగా పట్టుకుని అసహజ శృంగారం... ఊపిరాడక ప్రియురాలు...

వారిద్దరూ ప్రేమికులు. వారిద్దరూ శారీరకంగా సంతోషంగా ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఆ పనిలో నిమగ్నమయ్యారు. అయితే, అసహజ శృంగారానికి ప్రియుడు పాల్పడటంతో ప్రియురాలు ఊపిరాడక తనువు చాలించింది. ఈ ఘటన ము

వారిద్దరూ ప్రేమికులు. వారిద్దరూ శారీరకంగా సంతోషంగా ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఆ పనిలో నిమగ్నమయ్యారు. అయితే, అసహజ శృంగారానికి ప్రియుడు పాల్పడటంతో ప్రియురాలు ఊపిరాడక తనువు చాలించింది. ఈ ఘటన ముంబై మహానగరంలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇద్దరు ప్రేమికులు.. గత యేడాది మార్చి నెలలో ముంబైలోని కోలాబా ఏరియాకు వచ్చారు. పర్యాటక వీసాపై ముంబైకి వచ్చిన వారిద్దరూ.. అక్కడున్న ఓ హోటల్‌లో దిగారు. అయితే ఓ రోజు తన ప్రియురాలు అపస్మారక స్థితిలో ఉందని యాకోవ్‌ హోటల్‌ సిబ్బందికి తెలియజేశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
 
అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఇజ్రాయిల్‌లోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఫొరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇటీవల పోలీసులకు అందింది. ఈ రిపోర్ట్‌లో వారికి విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. 
 
ఆ ఇజ్రాయిల్‌ జంట లైంగిక చర్యలో ఉండగా యాకోవ్‌ తన ప్రియురాలి గొంతు గట్టిగా పట్టుకుని అసహజ శృంగారానికి పాల్పడటంతో ఊపిరాడక మృతి చెందినట్లు ఈ నివేదికలో వెల్లడైందని పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో యేడాది అనంతరం అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు ఇజ్రాయిల్‌లో ఉన్నాడు.