శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 జులై 2018 (17:35 IST)

సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ తర్వాత కాజల్ అగర్వాల్.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో..?

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ తరపున కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ తరపున కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనున్నారు.  ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. సోమవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 
 
ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్‌, శ్రీవాస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, శ్రీవాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను బెల్లంకొండ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 
 
మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ''సాక్ష్యం'' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. శ్రీవాస్‌ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కాజల్‌ ప్రస్తుతం ''క్వీన్‌'' తమిళ రీమేక్‌ ''ప్యారిస్‌ ప్యారిస్''లో నటిస్తున్నారు. కాగా, ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్‌తో స్టార్ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే.