మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (16:20 IST)

ఈషా రెబ్బా ఎఫెక్ట్... అర్జున్ రెడ్డి.. ప్లాస్టిక్ వాడొద్దు-కేటీఆర్..

తెలంగాణ ఎన్నో విషయాల్లో నెంబర్ వన్‌గా వుంది. అయితే ప్లాస్టిక్ నిషేధిత రాష్ట్రాల్లో మాత్రం టాప్‌లో లేకపోవడం నిరాశ కలిగిస్తోందని.. హీరోయిన్ ఈషా రెబ్బా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ

తెలంగాణ ఎన్నో విషయాల్లో నెంబర్ వన్‌గా వుంది. అయితే ప్లాస్టిక్ నిషేధిత రాష్ట్రాల్లో మాత్రం టాప్‌లో లేకపోవడం నిరాశ కలిగిస్తోందని.. హీరోయిన్ ఈషా రెబ్బా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఈషా రెబ్బా ట్వీట్‌పై వెంటనే స్పందించారు.


తొలుత ఈషా ఓ ట్వీట్‌ను పెడుతూ, ప్లాస్టిక్ నిషేధిత రాష్ట్రాల్లో మాత్రం లేకపోవడం నిరాశ కలిగిస్తోందని వ్యాఖ్యానిస్తూ, కేటీఆర్‌ను ట్యాగ్ చేయగా, ఆయన వెంటనే స్పందించారు. 
 
కేవలం చట్ట ప్రకారం ఓ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ప్లాస్టిక్ వాడకం ఆగదని, నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలంటే, ప్లాస్టిక్ తయారీ కంపెనీలు, అధికారులు, ప్రజలకు సమస్య తీవ్రత గురించి తెలియాల్సివుందని చెప్పారు. ఓ పద్ధతి ప్రకారం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. 
 
కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన ఈషా రెబ్బా వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. కానీ మీలాంటి యువనేత, సమర్థవంతమైన నేత వుండగా ప్లాస్టిక్ నిషేధం అసాధ్యమని తాను అనుకోవట్లేదని చెప్పింది. ప్లాస్టిక్ నిషేధంలోనూ తెలంగాణను నంబర్ వన్‌గా నిలపాలని కోరింది.
 
ఇదిలా ఉంటే.. అర్జున్ రెడ్డి చిత్రానికి గానూ మొదటి ఫిలింఫేర్‌ను అందుకున్న టాలీవుడ్ సెన్సేషనల్ నటుడు విజయ్ దేవరకొండ.. తన అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ విషయాన్ని కేటీఆర్‌కు తెలపగా సంతోషించిన మంత్రి, విజయ్‌ నిర్ణయాన్ని అభినందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ విజయ్ ఇంటికి వెళ్లారు. 
 
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఫిలింఫేర్ అవార్డును కేటీఆర్‌కు చూపించానని తెలిపాడు. వేలం గురించి మాట్లాడుకున్నాం.. తన అభిమానుల గురించి కూడా చెప్పానని సోషల్ మీడియాలో కేటీఆర్‌తో తీయించుకున్న ఫోటోలను షేర్ చేశాడు. చరిత్ర, చేనేత వస్త్రాలు, నీటి సంరక్షణ, హైదరాబాద్‌లో రోడ్లను ఎందుకు తవ్వుతున్నారనే వాటిపై కేటీఆర్ తమకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్లాస్టిక్ వాడొద్దన్నారని తెలిపాడు.