మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (12:54 IST)

మళ్లీ డోపింగ్‌లో దొరికిపోయిన అహ్మద్ షెహజాద్..

మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్ వివాదం సంచలనం సృష్టించింది. ఇక నిన్నటి నిన్న శ్రీలంక కెప్టెన్ చండీమల్‌పై బాల్ ట్యాంపరింగ్‌ నిజమని తేలడంతో నిషేధం వేటు పడింది. తాజాగా పాకిస్థాన్

మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్ వివాదం సంచలనం సృష్టించింది. ఇక నిన్నటి నిన్న శ్రీలంక కెప్టెన్ చండీమల్‌పై బాల్ ట్యాంపరింగ్‌ నిజమని తేలడంతో నిషేధం వేటు పడింది. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ మళ్లీ డోప్ పరీక్షలో దోషిగా తేలాడు. దీంతో అతను కనీసం మూడు నెలల పాటు నిషేధం ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
గతంలోనూ షెహజాద్ డోపింగ్‌లో దొరికాడు. దీంతో పాకిస్థాన్‌ సెలక్టర్లు అతనిని పక్కనబెట్టారు. తాజాగా పాకిస్థాన్‌లో జరిగిన దేశవాళీ వన్డే టోర్నమెంట్ సమయంలో అతనికి డోప్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో అతను పాజిటివ్‌గా తేలాడు. ఆ టోర్నీలో అతను 372 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు, ఓ సెంచరీ వున్నాయి. ఇంకా ఓ క్రికెటర్ డోపింగ్‌లో పట్టుబడినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ట్విట్టర్లో ధ్రువీకరించింది. 
 
ఇదిలా ఉంటే.. ఆసీస్‌ జట్టుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే- నైట్‌ వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టిమ్‌ పెయిన్‌ సేన దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆసీస్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 
 
ఆసీస్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన కావడంతో ఆసీస్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌‌... ‘నిద్ర లేవండి, ఇంగ్లండ్‌ స్కోరు ఒకసారి చూడండి. అసలు అక్కడ ఏం జరుగుతోంది. వాట్‌ ద హెల్‌ అంటూ ట్వీట్ చేశాడు.