శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By selvi
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (19:13 IST)

కోపం వద్దు సహనం ముద్దు.. ఎదుటి వ్యక్తి విమర్శించినా...

కోపం వద్దే వద్దు.. సహనమే ముద్దు అంటున్నారు సైకాలజిస్టులు. కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. కోపానికి కారణమవుతున్న వ్యక్తుల్లోని పాజిటివ్ పాయింట్లను తీసుకోవాలే కానీ నెగటివ్ పాయింట్లను పక్కనబెట్టా

కోపం వద్దే వద్దు.. సహనమే ముద్దు అంటున్నారు సైకాలజిస్టులు. కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. కోపానికి కారణమవుతున్న వ్యక్తుల్లోని పాజిటివ్ పాయింట్లను తీసుకోవాలే కానీ నెగటివ్ పాయింట్లను పక్కనబెట్టాలి. సెన్సాఫ్ హ్యూమర్‌ను డెవలప్ చేసుకోవాలి. కోపానికి కారణమవుతున్న వ్యక్తికి బేరీజు వేసుకోండి. సహనం కోల్పోకుండా మృదువుగా మాట్లాడటం చేయండి. 
 
మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వినేందుకు ఎదుటి వ్యక్తి ఆసక్తి చూపకపోయినా ఓర్పుతోనే వుండాలి. ఎదుటి వ్యక్తి తాను మాట్లాడేదే కరెక్ట్ అంటున్నా.. తాను చెప్పిందే వినాలని బలవంత పెట్టినా కామ్‌గా వుండాలి. 
 
ఒకవేళ అలాంటి వ్యక్తితో పదే పదే సమస్య వేధిస్తే.. అతనికి దూరంగా వుండాలి. ఎదుటి వ్యక్తి విమర్శించినా సహృదయంతో స్వీకరించాలి. ఇలా చేస్తే కోపంతో ఏర్పడే మానసిక ఆందోళనలను దూరం చేయడంతో పాటు.. ఇతరులను సులభంగా నియంత్రించేందుకు వీలుంటుందని సైకలాజిస్టులు సూచిస్తున్నారు.