సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 4 నవంబరు 2017 (11:42 IST)

"గరుడవేగ" అదిరిందంటూ దర్శకధీరుడు ప్రశంస...

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హీరో రాజశేఖర్ నటించిన చిత్రం "పీఎస్‌వి గరుడవేగ 126.18ఎంఎం" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, కిశోర్‌, నాజర్‌, పోసాని కృష్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హీరో రాజశేఖర్ నటించిన చిత్రం "పీఎస్‌వి గరుడవేగ 126.18ఎంఎం" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, కిశోర్‌, నాజర్‌, పోసాని కృష్ణమురళి నటించారు. బాలీవుడ్‌ నటి సన్నీలియోని ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. 
 
అయితే, ఈ చిత్రం రిలీజైన తొలి ఆట నుంచి మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పైగా, పలువురు టాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ కోవలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా ఈ చిత్రం అదిరిందంటూ ట్వీట్ చేశారు. 
 
ఈ యూనిట్‌ సభ్యులకు అభినందనలు చెప్పారు. సినిమా సానుకూలమైన స్పందన పొందిందన్నారు. ఆదివారం షోకు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై రాజశేఖర్‌ స్పందించారు. ‘ధన్యవాదాలు సర్‌. మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చాయి’ అంటూ ట్వీట్ చేశారు.