గోపీచంద్ అది బాగా నేర్చుకున్నాడట..!
హీరోగా పరిచయమై.. విలన్‌గా ట్రై చేసి.. ఆ తర్వాత మళ్లీ హీరోగా నటిస్తూ కెరీర్ కొనసాగిస్తోన్న యువ హీరో గోపీచంద్. ఇటీవల గోపీచంద్ టైమ్ ఏం బాగోలేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్ నటించిన తాజా చిత్రం పంతం. ఇందులో గ
హీరోగా పరిచయమై.. విలన్‌గా ట్రై చేసి.. ఆ తర్వాత మళ్లీ హీరోగా నటిస్తూ కెరీర్ కొనసాగిస్తోన్న యువ హీరో గోపీచంద్. ఇటీవల గోపీచంద్ టైమ్ ఏం బాగోలేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్ నటించిన తాజా చిత్రం పంతం. ఇందులో గోపీచంద్ సరసన మెహ్రీన్ నటించింది. చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కె.రాధామోహన్ ఈ సినిమాని నిర్మించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన పంతం ఈ నెల 5న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా గోపీచంద్ 25వ సినిమా కావడం విశేషం.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ… ఈ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. 25వ సినిమా కదా స్పెషల్ కేర్ తీసుకున్నారా అంటే… నా ప్రతి సినిమాని మొదటి సినిమాగా భావించి చేస్తాను. అంతేకానీ.. 25వ సినిమా కాబట్టి బాగా చేయాలి అని ఏం లేదు. 25వ సినిమా అనేది ఓ నెంబర్ మాత్రమే. ఇక 25 సినిమాల నుంచి ఏం నేర్చుకున్నారు అంటే… ఏది మంచి స్ర్కిప్టో.. ఏది కాదో అని జడ్జ్ చేయడం నేర్చుకున్నాను అని చెప్పారు. బాగానే ఉంది మరి.. అంత కరెక్ట్‌గా జడ్జ్ చేయడం నేర్చుకున్నప్పుడు ఫ్లాప్ ఎందుకు వస్తుందో మరి..!