సంబంధిత వార్తలు
- ఖచ్చితంగా సాధ్యమే.. నన్ను నమ్మండి అని చంద్రబాబు నమ్మించి ముంచారు : పవన్ కళ్యాణ్
- పవన్ కల్యాణ్ రహస్యంగా పూజలు చేశారా? కత్తి మహేష్ చెప్పిందేనా?
- నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్
- కౌశల్ గురించి పవన్ కళ్యాణ్‌కు అప్పుడే తెలుసా? ఏమన్నారంటే?
- పవన్ హత్యకు కుట్రపన్నిన ఆ ముగ్గురు? డీజీపీ ఏమంటున్నారు
బాబుకు మద్దతిచ్చి తప్పు చేశా.. జగన్ సీఎం అయ్యేవారు : పవన్
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను మద్దతివ్వకుండా ఉండివుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూర్చొనివుండేవారని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్య
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను మద్దతివ్వకుండా ఉండివుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూర్చొనివుండేవారని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ, ఆ ఎన్నికల్లో చంద్రబాబును గుడ్డిగా నమ్మి ఆయనకు మద్దతిచ్చి అతిపెద్ద తప్పు చేసినట్టు చెప్పుకొచ్చారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాను, తప్పు చేశానని బాధపడుతున్నానన్నారు. తాను మద్దతివ్వడం వల్ల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇపుడు రూ.వేల కోట్లు దోచుకుతింటున్నారని, సీఎం చంద్రబాబు డబ్బే ప్రధానంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ రాష్ట్రంలో 14 వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెబుతున్నారని, అయితే జంగారెడ్డిగూడెం నుంచి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ట్రాఫిక్ లేని సమయంలో 14 కిలోమీటర్లు వెళ్లేందుకు తనకు 40 నిమిషాలు పట్టిందని, దీన్నిబట్టి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు.
