మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (15:49 IST)

పవన్ కల్యాణ్ రహస్యంగా పూజలు చేశారా? కత్తి మహేష్ చెప్పిందేనా?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి రహస్య పూజలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి రహస్య పూజలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ద్వారకా తిరుమల లోని జగన్నాథపురం నరసింహ స్వామి ఆలయంలో ఆయన సోమవారం వేకువ జామున 3 గంటల నుంచి 4.30 గంటల వరకూ నిర్వహించారని చెప్పుకుంటున్నారు. ఐతే ఆయన ఎలాంటి పూజలు చేశారన్నది మాత్రం వెల్లడికాలేదు. 
 
ఇకపోతే అచ్చం ఇలాగే గతంలోనూ పవన్ కల్యాణ్ రహస్య పూజ చేసినట్లు ప్రచారం జరిగింది. గతంలో జల్సా చిత్రం విడుదలకు ముందు పవన్ కల్యాణ్ ఆ చిత్రం కోసం ఇక్కడే రహస్య పూజ చేశారని చెప్పుకున్నారు. కత్తి మహేష్ దీనిపై సవాల్ కూడా విసిరాడు. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ అంతా కలిసి ఈ దేవాలయంలో పూజలు చేశారంటూ కత్తి ఆరోపించాడు. దీనిపై ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కాగా ఇప్పుడు మరోసారి పవన్ పూజలు చేశారంటూ ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజం ఎంత వున్నదన్నది తేలాల్సి వుంది.