సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By preethi
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (12:10 IST)

కౌశల్ గురించి పవన్ కళ్యాణ్‌కు అప్పుడే తెలుసా? ఏమన్నారంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌషల్ తన ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌లో పాల్గొంటూ తన మనస్సులోని భావాలను బయటపెట్టారు. కెరీర్ మొదట్లో తనెలా కష్టపడిందీ, ఎవరెవరు స్ఫూర్తినిచ్చారు అనే విషయాలను భావోద్వేగంతో పంచుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌషల్ తన ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌లో పాల్గొంటూ తన మనస్సులోని భావాలను బయటపెట్టారు. కెరీర్ మొదట్లో తనెలా కష్టపడిందీ, ఎవరెవరు స్ఫూర్తినిచ్చారు అనే విషయాలను భావోద్వేగంతో పంచుకున్నారు. హైదరాబాద్‌లో తాను తొలిసారిగా మోడలింగ్ అకాడెమీ పేరుతో ఒక మోడలింగ్ అకాడెమీని ప్రారంభించానని, దానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారని తెలిపాడు. 
 
ఆ అకాడెమీ ద్వారానే పవన్ కళ్యాణ్ గారితో ఏర్పడిందని కౌశల్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాకి మోడలింగ్ కో-ఆర్డినేటర్‌గా పని చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేయి వేసి నాకో విషయం చెప్పారు.
 
రాత్రి మొత్తం మోడల్స్‌ని కో-ఆర్డినేట్ చేసే పని చూసుకుని, మళ్లీ పొద్దున్నే షూటింగ్‌కి వచ్చి ఏ మాత్రం అలసట కనిపించకుండా పని చేయడం ఆయన గమనించారు. అదే విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు నాతో ప్రస్తావిస్తూ నీ హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చటేస్తోంది కౌశల్. మనం ఎంతలా కష్టపడుతున్నామో, ఆ కష్టాన్ని ఎల్లకాలం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం అని అన్నారు.
 
ఆ మాటలను గుర్తు చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్‌లో తాను పడ్డ కష్టానికి భవిష్యత్తులో ప్రతిఫలం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేసారు.