సంబంధిత వార్తలు
- తనను పెళ్లాడేందుకు నిరాకరించిందని 38 సార్లు కత్తితో పొడిచి మీద ఎక్కి కూర్చున్నాడు...
- సమంత, తమన్నా బాటలో పాయల్.. ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్
- గర్భంతో వున్న అమృతవర్షిణి.. నాన్న అబార్షన్ చేసుకోమని ఒత్తిడి తెచ్చేవాడు..
- టికెట్ లేకుండా యువకుడి రైలు ప్రయాణం.. ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు?
- మన్మథుడు 2లో హీరో ఎవరో బయట పెట్టిన చైతు
ప్రణయ్ హత్య కేసు.. నల్గొండ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు లింకేంటి?
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండి కరీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచే కరీమ్‌ను పోలీసులు ప్
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండి కరీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచే కరీమ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సుపారీ మాట్లాడటం నుంచి హంతకుల ఏర్పాటు వరకూ ఇతని పర్యవేక్షణలోనే జరిగినట్టు సమాచారం.
కరీమ్ ప్రస్తుతం నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ప్రణయ్‌ని హత్య చేయించడానికి మారుతీరావుకు ఇతను సహకరించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన అల్లుడిని హత్య చేయాలని మారుతీరావు నిర్ణయించుకున్న తర్వాత మిగతా ఫ్లాన్ మొత్తాన్ని కరీమ్ నడిపించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. పరువు హత్యకు గురైన ప్రణయ్ మృతదేహాన్ని చూసి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త విగతజీవిలా మారిపోవడాన్ని చూసిన అమృత బోరుమంది. అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అమృత.. కలకాలం నిండు జీవితాన్ని పంచుకోవాలనుకున్న భర్త ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది.
