1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Nobody Can Touch Me At least Till 2019 Lok Sabha Polls: HD Kumaraswamy

కనీసం ఒక యేడాది వరకు సీఎంగా ఉంటాను.. : కుమార స్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి తన సీఎం కుర్చీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కనీసం ఒక యేడాది పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు వరకు అయ్యేవరకు సీఎంగా ఉంటాననీ, అప

HD Kumaraswamy
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి తన సీఎం కుర్చీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కనీసం ఒక యేడాది పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు వరకు అయ్యేవరకు సీఎంగా ఉంటాననీ, అప్పటివరకు, ఎవరూ నన్ను ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు.
 
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పొత్తుతో నడుస్తున్న ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందనే విషయమై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, '2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు నన్ను ఎవరూ కదిలించ లేరు. మా సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగా పని చేస్తుంది. ఒక ఏడాది పాటు నన్ను ఎవరూ కదిలించలేరనే విషయం నాకు తెలుసు. కనీసం ఒక ఏడాది వరకు నేను ఉంటాను, అంటే లోక్‌సభ ఎన్నికల వరకు అయ్యేవరకు.  అప్పటివరకు, ఎవరూ నన్ను ఏమీ చేయలేరు' అని స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, 'సీఎం అయ్యే అవకాశం పొందిన నేను, ఇతరులు ఏం చేశారనే దానిపై దృష్టి పెట్టడం కన్నా.. నేను ఏం చేశాను అనేదే చూపిస్తాను. ఈ క్రమంలో మంచి వర్షాలతో వాతావరణం కూడా నాకు సహకరిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే మంచి నిర్ణయాలను తీసుకుంటా. రైతులకు రుణమాఫీ విషయమై ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నా. రుణమాఫీ ద్వారా ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా చూస్తున్నా. ఈ విషయమై త్వరలోనే ఓ ప్రకటన చేస్తా' అని ఆయన శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బైక్‌పై వెళుతున్న జంటను ఆపి.. మహిళను రేప్ చేసిన కానిస్టేబుల్