సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (16:03 IST)

బైక్‌పై వెళుతున్న జంటను ఆపి.. మహిళను రేప్ చేసిన కానిస్టేబుల్

మహిళలపై సాధారణ పౌరులే కాదు.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు సైతం అత్యాచారాలకు తెగబడుతున్నారు. అదీ వాహనాల తనిఖీల పేరుతో ద్విచక్రవాహనాలు ఆపిమరీ ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.

మహిళలపై సాధారణ పౌరులే కాదు.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు సైతం అత్యాచారాలకు తెగబడుతున్నారు. అదీ వాహనాల తనిఖీల పేరుతో ద్విచక్రవాహనాలు ఆపిమరీ ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా వేములపల్లిలో ఓ మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సూర్యాపేట జిల్లా చివ్వెంల పీఎస్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా బాలూనాయక్  పని చేస్తున్నాడు. ఈయన వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యాడు. అపుడు బైకులపై వచ్చే జంటలను ఆపి వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బైకుపై వెళుతున్న ఓ జంటను ఆపాడు. 
 
వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసుకున్న అనంతరం, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేయగా, బాలూ నాయక్‌ను నల్గొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.