శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (11:42 IST)

అమ్మబాబోయ్.. విశ్వవిద్యాలయాల్లోనూ ర్యాగింగ్...

కళాశాలల్లో ర్యాకింగ్ కట్టడికి ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో కొంతమేరకు అదుపులోకి వచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఈ ర్యాగింగ్ భూతం తీవ్రస్థాయిలో ఉన్నట్టు

కళాశాలల్లో ర్యాకింగ్ కట్టడికి ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో కొంతమేరకు అదుపులోకి వచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఈ ర్యాగింగ్ భూతం తీవ్రస్థాయిలో ఉన్నట్టు తాజాగా తేలింది. ఈ మేరకు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్‌ (యూజీసీ)కి ఫిర్యాదులు అందాయి.
 
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 32 ఫిర్యాదులు వెళ్లగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో ర్యాగింగ్ జరిగిందని 98 మంది యూజీసీకి ఫిర్యాదు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో 165 ర్యాగింగ్ కేసులు వెలుగుచూశాయి. ర్యాగింగ్ చేసే విద్యార్థులను సస్పెన్షన్, డిబార్ చేస్తున్నా దీనికి తెరపడటం లేదని విద్యారంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.