గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (14:38 IST)

కడుపు నొప్పి ఎలా వుందో చూస్తానని అత్యాచారం చేసిన ఆర్ఎంపీ డాక్టర్

మహిళలపై కామాంధులు ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో తెలియడంలేదు. ఏడు నెలల గర్భిణి కడుపు నొప్పిగా వున్నదని ఆసుపత్రికి వస్తే ఆమెపై అత్యాచారం చేశాడు ఓ డాక్టర్. ఇది గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గురువారం అర్థరాత్రి చిలకలూరిపేటలో వుంటున్న ఏడు నెలల గర్భిణికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దాంతో ఆ బాధ ఎందుకనో అనే ఆందోళనతో అర్థరాత్రివేళ తన భర్తను తీసుకుని సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు మందులు రాశాడు. ఆ మందులను తీసుకురావాల్సిందిగా భర్తను మందుల దుకాణానికి పంపించాడు. 
 
అతడు అలా వెళ్లగానే వైద్యుడు కాస్తా కామాంధుడుగా మారిపోయాడు. ఏడు నెలల గర్భిణిపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.