శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (13:04 IST)

''కాలా'' కోసం సెలవు.. సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇంకేముంది?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ''కాలా''. ఈ సినిమా జూన్ 7 (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా తలైవా ఫ్యాన్స్ ఆత్రుతగ

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ''కాలా''. ఈ సినిమా జూన్ 7 (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా తలైవా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు చాలామంది ఆ రోజున సెలవు పెట్టయినా 'కాలా' సినిమా చూడాలనుకుంటున్నారు. 
 
ఇలా ఉద్యోగులందరి దృష్టి ''కాలా'' సినిమాపై ఉందని గమనించిన కేరళలోని ''టెలిసియస్ టెక్నాలజీ'' అనే ఓ ఐటీ సంస్థ గురువారం సెలవు దినంగా ప్రకటించింది. ఉద్యోగుల ఆనందాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో ఎలాంటి పబ్లిసిటీ లేదని సదరు సంస్థ ప్రకటన చేసింది.
 
ఇదిలా ఉంటే, కావేరీ నదీ జలాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాలా సినిమాను అడ్డుకుంటామని కన్నడ అనుకూల సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కావేరీ నదీ జలాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని రజనీ డిమాండ్ కూడా చేశారు. 
 
అయితే సినిమా విడుదలను నిలిపివేయాలని సీఎం కుమారస్వామి కూడా భావిస్తుండగా, కర్ణాటక హైకోర్టు సైతం సినిమా ప్రశాంతంగా విడుదల అయ్యేందుకు అవసరమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆదేశించింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాటిని అమలు చేస్తామని కుమారస్వామి ప్రకటించారు. 
 
తాజాగా రజనీకాంత్ నటించిన కాలా సినిమా విడుదల నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం రేపు విడుదల కానుంది. సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.