1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Parliament Monsoon Session : Telugu Desam MPs decide to talk tough in Parliament

పార్లమెంట్ సమావేశాలు : మోడీ భరతం పట్టండి.. ఎంపీలతో చంద్రబాబు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ భరతం పట్టాలంటూ సొంత పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Parliament Monsoon Session
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ భరతం పట్టాలంటూ సొంత పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
 
ముఖ్యంగా, పార్లమెంట్ తలుపులను మూసేసి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని గతంలో ఆరోపించిన ప్రధాని నరేంద్ర మోడీ, జరిగిన అన్యాయాన్ని ఎందుకు సరిదిద్దడం లేదని నిలదీయాలంటూ ఎంపీలను కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌లో ఎంపీలతో చంద్రబాబు మాట్లాడి దిశానిర్దేశం చేశారు. 
 
ఒక లక్ష్యం కోసం మనం పోరాటం చేస్తున్నామని ఎంపీలతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళదామని అన్నారు. సభలో సస్పెండ్ చేసినా వెనుకాడవద్దని, ఏ పరిణామానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అవిశ్వాస తీర్మానంపై వివిధ పార్టీల ప్రతినిధులను కలసి మద్దతు కోరిన ఎంపీలను ప్రత్యేకంగా అభినందించిన చంద్రబాబు, సభలో ప్రధానిని నిలదీయాలని అన్నారు. అన్యాయం జరిగిందన్న ఆయనే ఎందుకు చక్కదిద్దలేదో అడగాలని, తాను ఎప్పటికప్పుడు ఢిల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటానని చంద్రబాబు తెలిపారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
యాహూ మెసెంజర్ సేవలు నిలిపివేత