శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (10:08 IST)

యాహూ మెసెంజర్ సేవలు నిలిపివేత

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ యాహూ తన మెసెంజర్ సేవలను బుధవారం నుంచి నిలిపివేసింది. దీని స్థానంలో కొత్తగా స్కిరల్ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రకటించింది.

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ యాహూ తన మెసెంజర్ సేవలను బుధవారం నుంచి నిలిపివేసింది. దీని స్థానంలో కొత్తగా స్కిరల్ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రకటించింది.
 
వాస్తవానికి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేయనున్నట్టు యాహూ సంస్థ గతంలోనే ప్రకటించింది. ఆ విధంగానే మెసెంజర్ సేవలను నిలిపివేసింది. 1998లో ప్రారంభమైన యాహూ మెసెంజర్ ఒకప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. 
 
ఒకపుడు చాటింగ్ అంటే నెటిజన్లకు యాహూ మెసెంజరే గుర్తుకు వచ్చేది. అయితే ఇప్పుడు ఆ యాప్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు పలు రకాలుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తుండడం బాధాకరమని ట్వీట్లు చేస్తున్నారు.