'నిన్ను ఖచ్చితంగా మిస్ అవుతాము మిస్టర్ 360' : సచిన్ ట్వీట్
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన డివిలియర్స్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'నువ
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన డివిలియర్స్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'నువ్వు మైదానంలో ఎలా ఉంటావో.. బయట కూడా నీకు 360 డిగ్రీల సక్సెస్ లభించాలి. నిన్ను ఖచ్చితంగా మిస్ అవుతాము డివిలియర్స్. నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. సచిన్‌తో పాటు ఐసీసీ, బీసీసీఐ సహా పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు ఏబీడీ రిటైర్‌మెంట్‌పై అతన్ని అభినందిస్తూ.. ట్వీట్ చేశారు.
కాగా, డివిలియర్స్ రిటైర్మెంట్ వార్త విన్న క్రికెట్ ప్రపంచం ఒకింత షాక్‌కు గురైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన, అనితర సాధ్యమైన బ్యాటింగ్‌లో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్న డివిలియర్స్ ఉన్నఫళంగా రిటైర్‌మెంట్ ప్రకటించడాన్ని ఏ ఒక్క క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేక పోతున్నారు.
కాగా, 2004 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. ఈ 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏబీడి మొత్తం 50 శతకాలు, 137 అర్థశతాకాలు, 2 ద్విశతకాలు సాధించాడు.
2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీడీ కేవలం 16 బంతుల్లో అర్థ శతకం, 31 బంతుల్లోనే శతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 149 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కాగా బుధవారం తన సోషల్‌మీడియా ఖాతాల్లో డివిలియర్స్ తన రిటైర్‌మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.