శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (19:07 IST)

అవిశ్వాసం పేరుతో కొత్తడ్రామాకు తెరలేపిన టీడీపీ

అధికార తెలుగుదేశం పార్టీపై వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవిశ్వాసం పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారంటూ ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం

అధికార తెలుగుదేశం పార్టీపై వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవిశ్వాసం పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారంటూ ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త రాజకీయ డ్రామాలు ఆడుతోందన్నారు.
 
గత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అవిశ్వాసం పెడితే మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. రాజీనామా చేసి మేం సరైన పని చేశామన్న సుబ్బారెడ్డి... రాజీనామా చేసిన 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల నిరసన తెలిపామన్నారు. 
 
అవిశ్వాసం పెట్టినప్పుడే మేం అన్ని పార్టీల మద్దతు కూడగట్టామన్న సుబ్బారెడ్డి... చిత్తశుద్ధిలేని టీడీపీ ఎంపీల మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. మాజీ ఎంపీలుగా మేం ఐదుగురం, ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులతో కలిసి పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్ దగ్గర ఆందోళన నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.