సంబంధిత వార్తలు
- మంత్రి పదవి లేదా రూ.100 కోట్ల ఆఫర్.. ఎవరికి ఎవరు ఆఫర్ చేశారు?
- జగన్‌కు షాక్... సైకిలెక్కనున్న వంగవీటి రాధా.. ముహూర్తం ఫిక్స్
- నిరంకుశత్వాన్ని ఎదిరించాలని ఎన్టీఆర్ నేర్పించారు : చంద్రబాబు
- చంద్రబాబు ఆహ్వానిస్తే ఖచ్చితంగా ప్రచారం చేస్తా : నందమూరి సుహాసిని
- షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుంది... టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు
టీడీపీ - జనసేనలు కలిసి పోటీ చేయొచ్చు : టీజీ వెంకటేష్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన పార్టీలు మళ్లీ కలిసి పోటీ చేయొచ్చంటూ టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమాజ్‌వాదీ - బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయని అందువల్ల ఏపీలో కూడా టీడీపీ - జనసేనలు కలిసి పోటీ చేయడంలో తప్పులేదన్నారు.
పైగా, ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో ఎలాంటి వైరం లేదన్నారు. కానీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీసే విషయంలోనే టీడీపీ - జనసేనల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని చెప్పారు.
ఇకపోతే, కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపులో ఎలాంటి గందరగోళం లేదనీ, కానీ ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం ఈ టిక్కెట్‌ను తనకే కేటాయిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కారణంగానే కొంత గందరగోళం నెలకొందన్నారు. వాస్తవానికి సర్వే ఫలితాల మేరకు ఈ సీటును పార్టీ అధినేత కేటాయిస్తారని తెలిపారు.
