శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (10:53 IST)

నిరంకుశత్వాన్ని ఎదిరించాలని ఎన్టీఆర్ నేర్పించారు : చంద్రబాబు

నిరంకుశత్వాన్ని, పెత్తందారీ వ్యవస్థను ఎదిరించాలని తనకు స్వర్గీయ ఎన్టీఆర్ నేర్పించారనీ, అందుకే నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శనివారం వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే బీజేపీయేతర రాజకీయ పార్టీల ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి తెరాస, వైకాపాలు మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నారని చెప్పారు. 
 
ప్రస్తుతం దేశంలో మోడీ వ్యతిరేక కూటమి, మోడీ అనుకూల కూటమి మాత్రమే ఉందన్నారు. వైకాపా, తెరాసలు మోడీ అనుకూల కూటమి కావడం వల్ల ఆ రెండు పార్టీలు హాజరుకావడం లేదని ఆయన చెప్పారు. ఇకపోతే, నిరంకుశత్వాన్ని ఎదిరించడాన్ని ఎన్టీఆరే నేర్పారన్నారు. ఇప్పుడు దేశంలో బీజేపీ రూపంలో నిరంకుశత్వం.. ప్రధాని మోడీ రూపంలో పెత్తందారీతనం ఉన్నాయని విమర్శించారు.