సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (09:07 IST)

షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుంది... టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు

వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా, షర్మిల తనకు కూతురుతో సమానమన్నారు. అందువల్ల ఆమెపై విమర్శలు చేయడం తనకు సబబుగా ఉండదన్నారు. 
 
ఇటీవల తెలుగుదేశం పార్టీపై షర్మిల చేసిన విమర్శలుపై జేసీ ప్రస్తావిస్తూ, షర్మిల తనకు కుమార్తెలాంటిందన్నారు. ఆమె కులాంతర వివాహం చేసుకున్నపుడే వైఎస్‌తో పాటు తాను కూడా ఆమెను అభినందించానని చెప్పారు. 
 
ఇకపోతే, జగన్ కేసీఆర్‌ల మధ్య స్నేహబంధు ఈనాటికి కాదన్నారు. వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ కోసం పని చేస్తున్నారని చెప్పారు. అందువల్ల జగన్‌తో కేటీఆర్ భేటీ కావడాన్ని పెద్ద అంశంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. 
 
నిజానికి జగన్, కేసీఆర్‌లు గత యేడాది కాలంగా కలిసి పనిచేస్తున్నారన్నారు. ఇపుడు కొత్తగా కలవలేదన్నారు. అయితే, కేసీఆర్‌ వంటి వ్యక్తులు మరో పదిమంది వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు.