గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (11:43 IST)

చంద్రబాబు ఆహ్వానిస్తే ఖచ్చితంగా ప్రచారం చేస్తా : నందమూరి సుహాసిని

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తానని దివంగత సినీ నటుడు హరికృష్ణ కుమార్తె నదమూరి సుహాసిని వెల్లడించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హైదరాబాద్, కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల కోసం గుంటూరు జిల్లా తెనాలికి వచ్చిన ఆమె మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఏపీలోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి తమ కుటుంబం పూర్తిగా సహకరిస్తుందన్నారు. 
 
మరోవైపు, కూకట్‌పల్లి ఓటర్లు తనను ఓడించినప్పటికీ తాను మాత్రం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మరోవైపు, సుహాసిని టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు.