1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. trans-women tie the knot in a mass wedding in Tirupati

ట్రాన్స్‌జెండర్స్ వెడ్డింగ్, ఒకేసారి మూడుజంటలు... 300 మంది హిజ్రాలు ఆశీర్వాదం(Video)

trans-women
భాజా భజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. అతిథుల సందడి.. ఆటపాటల మధ్య హిజ్రాల వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. తిరుపతిలోని స్థానిక దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద నిన్న రాత్రి సందడిగా వివాహ ఘట్టం జరిగింది. మూడు జంటలు ఒక్కటయ్యాయి.
 
తిరుపతికి చెందిన స్వప్న-చిన్ని, సిమ్రాన్-ప్రశాంతి, జానకి-అమూల్యలు వివాహం చేసుకోగా హిజ్రా పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. అన్ని వివాహాలలానే మూడుముళ్ళు వేసి భర్తలు, భార్యలను స్వీకరించారు. ఈ వివాహానికి రాయలసీమ జిల్లాల నుంచి 300 మంది హిజ్రాలు ఆశీర్వదించారు. ఒకేసారి మూడు వివాహాలు జరగడంతో అత్యంత ఆనందకరంగా హిజ్రాలు సంతోషం వ్యక్తం చేశారు. చూడండి వీడియో...
తర్వాతి కథనం
ముసుగులు నిషేధించిన శ్రీలంక... బుర్ఖాలు కూడానా?