శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (18:30 IST)

సీసీటీవీ ఆఫ్‌చేసి.. మత్తుమందిచ్చి... ఐసీయు వార్డులో రోగిపై గ్యాంగ్ రేప్

కొందరు మగాళ్లు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిలు కంట కనపడితే చాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న రోగిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 29 యేళ్ల ఓ మహిళ అనారోగ్యానికిగురైన ఐసీయూ వార్డులో చికిత్స పొందుతుంది. ఆ రోగికి కొందరు మృగాళ్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిమరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుల్లో ఓ వైద్యుడు ఉండటం గమనార్హం. ఈ ఘటన గత శనివారం రాత్రి జరిగింది. 
 
బాధిత మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముందస్తు పథకం ప్రకారం మత్తు ఇంజక్షన్‌​ ఇచ్చి.. అక్కడి సిసీటీవీని ఆఫ్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామని సీనియర్‌ అధికారి హరిమోహన్‌ సింగ్‌ తెలిపారు. ఇప్పటికే  ఒక మహిళ సహా, ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.