మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 మార్చి 2019 (10:59 IST)

భార్యపై బావతో కలిసి అత్యాచారం చేసిన భర్త...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో దారుణం జరిగింది. వివాహం జరిగిన తొలిరాత్రే అంటే శోభనం రాత్రే కట్టుకున్న భార్యపై తన సొంత భావతో కలిసి కట్టుకున్న భర్తే అత్యాచారం జరిపాడు. ఈ దారుణం ఈనెల 6వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్‌ నగర్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి ఇటీవల అదే నగరానికి చెందిన యువకునితో మర్చి 6న వివాహం జరిగింది. అదే రోజు రాత్రి నవ వధువు(26)పై బావతో కలిసి ఆమె భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని తప్పించుకోవడానికి ప్రయత్నించగా తీవ్రంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు.
 
దీనిపై వధువు సోదరుడు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. దీనిపై అతను మాట్లాడుతూ, పెళ్లి రోజు కట్నం కోసం వరుడు, అతని కుటుంబ సభ్యులు గొడవ చేశారు. సోదరి పెళ్లి కోసం అప్పటికే తాము రూ.7 లక్షలు కట్నం ఇచ్చామన్నారు. పెళ్లి రోజు రాత్రి వరుడు, అతని బావ కలిసి మద్యం సేవించారని, అదే మత్తులో తన సోదరిపై అత్యాచారానికి తెగబడ్డారని వెల్లడించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.