సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (20:53 IST)

మూడుముళ్ళు పడిన తరువాత తెలిసింది భర్తకు మూడేళ్ళ కొడుకున్నాడని....

అక్రమ సంబంధాలు పెట్టుకుని వివాహానికి ముందే యువతులతో కలిసి పిల్లలు పుట్టిన తరువాత వారితో ఏదో ఒకవిధంగా గొడవలు పెట్టుకుని ఇంకో పెళ్ళి చేసుకునే యువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఇక్కడ ప్రేమించుకున్న ఇద్దరూ ఒకరిని ఒకరు మోసం చేసేసుకున్నారు.
 
తెలంగాణా రాష్ట్రం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండం తీల్మాపూర్‌కు చెందిన రాజశేఖర్ స్థానికంగా ప్రొవిజన్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఆదిలాబాద్‌కు చెందిన అయేషా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. నాలుగేళ్ళ పాటు వీరు కలిసి ఉన్నారు. దీంతో ఒక మూడేళ్ళ కొడుకు కూడా పుట్టాడు. 
 
ముందుగా వీరిద్దరు ఎవరికి తెలియకుండా పెళ్ళి చేసుకున్నారు. అయేషా తీరుపై అనుమానం పెట్టుకున్న రాజశేఖర్ ఆ తరువాత వాకబు చేశాడు. అయేషాకి అప్పటికే పెళ్ళయి నాలుగు నెలలకే భర్తను వదిలేసిందని తెలుసుకున్నాడు. దీంతో ఇంకో పెళ్ళి చేసుకోవడానికి సిద్థమయ్యాడు. శివానీ అనే అమ్మాయితో పెళ్ళయ్యింది. 
 
అది కూడా వారంరోజుల్లో హడావిడి చేసి పెళ్ళి చేసుకున్నాడు. శివానీకి మూడు ముళ్ళు వేసిన తరువాత అయేషా పెళ్ళి మండపానికి వచ్చింది. తనతో రాజశేఖర్ కలిసి ఉన్న ఫోటోలను చూపించింది. దీంతో పెళ్ళికూతురు బంధువులు షాకయ్యారు. న్యాయం కావాలాంటూ పోలీస్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.