గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:31 IST)

వేదికపై పెళ్లి కుమార్తె... వాష్ రూమ్‌లో వెయిట్రెస్‌కు వరుడు ముద్దులు... ఆపై...

పెళ్లి అంటే నూరేళ్ల పండుగ అని పెద్దలు చెబుతారు. వధూవరులు కలకాలం సుఖంగా ఉండాలని అందరూ ఆశీర్వదిస్తారు. కానీ జరిగిన కొద్ది సమయంలోనే ఓ పెళ్లి పెటాకులు అయింది. దానికి కారణం వరుడి అసభ్య ప్రవర్తన. పెళ్లై గంటలు కూడా గడవకముందే మరో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన వరుడిని చూసి వధువు విస్తుపోయింది. ఏమి చేయాలో తెలియక ఆలోచనలో పడింది. 
 
అమెరికాలోని పెన్సిల్వేనియాలో నార్త్ ఆంప్టన్ నగరంలో ఓ పెళ్లి వేడుక ఆడంబరంగా జరుగుతోంది. పెళ్లి కొడుకు రిసెప్షన్ కోసం అందంగా ముస్తాబయ్యాడు. వధువు రాక కోసం వేదికపై ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అక్కడికి వెయిట్రెస్ అమ్మాయి రావడంతో అతని దృష్టి ఆమెపై పడింది. ఆ టీనేజీ అమ్మాయి దగ్గరకు వెళ్లి శృంగారం చేద్దామా అని అడిగాడు. పెళ్లికొడుకు అని గ్రహించిన ఆమె ఏమీ మాట్లాడలేదు. 
 
తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వెనుక వెంబడించాడు. వాష్‌రూమ్‌లోకి వెళితే రాలేడనుకుంది. అక్కడికీ వెళ్లి ముద్దులు పెట్టాడు, బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు. బయటకు వచ్చి ఆ అమ్మాయి జరిగిన విషయం అందరికీ చెప్పింది. దాంతో పెళ్లికూతురు వివాహాన్ని తిరస్కరించింది. పెళ్లికొడుకు ఆమెను బూతులు తిట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.