ముఖేశ్ ఇంట మరో పెళ్లిసందడి... వెడ్డింగ్ కార్డు అదిరిపోయింది... (Video)

akash shloka wedding card
Last Updated: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (18:37 IST)
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట మరో పెళ్లి సందడి జరుగనుంది. ముఖేశ్ - నీతా దంపతుల ముద్దుస తనయుడు ఆకాశ్ పెళ్లి వచ్చే నెల 9వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈయన శ్లోకా అనే యువతిని పెళ్లాడనున్నాడు. ఈ పెళ్లి కోసం ముఖేశ్ కుటుంబం ముద్రించిన పెళ్లి పత్రిక అదిరిపోయింది. ఈ పెళ్లి పత్రికే ఇలావుంటే వివాహం మరెంత ఘనంగా నిర్వహిస్తారోనని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

ఆకాశ్ - శ్లోకాల నిశ్చితార్థం గత యేడాది మార్చిలో జరిగింది. పెళ్లి మాత్రం మార్చి 9న జరుగనుంది. ఈ పెళ్లికి అంబానీ దంపతులు ఓ వెరైటీ పెళ్లి ప‌త్రిక‌ను త‌యారు చేయించారు. బోర్డ్ గేమ్ సైజ్‌లో ఉన్న ఆ వెడ్డింగ్ కార్డు ప్రతి ఒక్కర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది. బాక్సు ఆకారంలో ఉన్న పెళ్లి ప‌త్రిక‌పై రాధాకృష్ణులు ఉన్నారు. ముంబైలోని సిద్ధ‌వినాయ‌క ఆల‌యంలో ఈ వివాహ ఆహ్వాన ప‌త్రిక‌ను ప్ర‌ద‌ర్శించారు.

పింక్ క‌ల‌ర్ వెడ్డింగ్ బాక్సుపై రాధాకృష్ణుల ఫోటో ఎంతో ర‌మ‌ణీయంగా ఉంది. పుష్పాలు, నెమ‌ళ్ల‌తో ఆ బాక్స్ క‌వ‌ర్‌ను క‌ళాత్మ‌కంగా తీర్చిదిద్దారు. బాక్సును ఓపెన్ చేస్తే, రాధాకృష్ణుల‌కు చెందిన మ‌రో సిల్వ‌ర్ ఫోటో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇంకా ఇన్న‌ర్ కంపార్ట్‌మెంట్‌ను తెరిస్తే, అప్పుడు పాప‌ప్ వెడ్డింగ్ కార్డు క‌నిపిస్తుంది.

ఆరెంజ్ క‌ల‌ర్‌తో ఉండే వెడ్డింగ్ కార్డు.. అతిథుల‌ను పెళ్లికి ఆహ్వానిస్తుంది. దీవెన‌ల‌ను కూడా కోరుతూ అంబానీ దంపతులు ఓ నోట్ రాశారు. "ఓ సూర్య దేవా.. మా ఆకాశ్‌లో నువ్వు వెలుతురువి, మాలో ప్ర‌తి శ్లోకాన్ని జ్వ‌లింప చేయాలి" అని పెండ్లి ఆహ్వాన ప‌త్రిక‌లో రాశారు. ఓసారి ఈ వీడియోను చూడండి.దీనిపై మరింత చదవండి :