ముఖేష్ అంబానీ ఇంట్లో మరో పెళ్లి సందడి...

akash ambani
కుమార్ దళవాయి| Last Modified మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:27 IST)
ముఖేష్ అంబానీ ఇంట్లో మరో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. గత డిసెంబర్ 12వ తేదీన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహాన్ని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీకి, ప్రముఖ వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కుమార్తెకు వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. కాగా ఈ పెళ్లి ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారు.

మార్చిలో ఆకాష్ వివాహం జరగనుండగా అంబానీ దంపతులు ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి తొలి శుభలేఖను స్వామికి అందజేసారు. నీతా, ముఖేష్ అంబానీలు పెళ్లి కొడుకు ఆకాష్‌తో సిద్ధి గణపతి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి, శుభలేఖను స్వామివారి పాదాలచెంత ఉంచారు.

ఇషా అంబానీ పెళ్లిని తమ స్వంత ఇంటిలో చేసిన ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లి మాత్రం జియో వరల్డ్ సెంటర్‌లో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ పెళ్లి ఏర్పాట్లు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు.దీనిపై మరింత చదవండి :