ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (10:04 IST)

పీకల్లోతు ప్రేమలో ముఖేష్ అంబానీ తనయుడు... డిసెంబరులో పెళ్లి...?

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ ప్రేమలో మునిగిపోయాడు. ఆయన ప్రేమలో పడింది ఎవరితోనో కాదు.. ప్రముఖ వజ్రాల వ్యాపారి రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకతో. దీంతో వీ

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ ప్రేమలో మునిగిపోయాడు. ఆయన ప్రేమలో పడింది ఎవరితోనో కాదు.. ప్రముఖ వజ్రాల వ్యాపారి రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకతో. దీంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. డిసెంబరులో వీరి విహాహం జరగనుండగా అతి త్వరలో నిశ్చితార్థం తేదీని ప్రకటించనున్నారు.
 
దీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆకాశ్, శ్లోక ఒకరినొకరు ఇష్టపడినట్టు సమాచారం. 12వ తరగతి బోర్డు పరీక్షల అనంతరం ఆకాశ్ తన ప్రేమను వ్యక్తపరచగా ఆమె కూడా అంగీకరించిందట. తాజాగా ఇరు కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించడంతో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే, ఈ పెళ్లి వార్తలను ఇరు కుటుంబాలు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.
 
ఆకాశ్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి అర్థ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం రిలయన్స్ జియో బోర్డులో కొనసాగుతున్నాడు. శ్లోక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో డిగ్రీ, ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయ విద్యలో లా పూర్తి చేశారు. 2014 నుంచి రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.