శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:12 IST)

ప్రియాంకా గాంధీ రోడ్ షో... సెల్ ఫోన్ దొంగలు వీరవిహారం...

ప్రియాంక గాంధీ రాకతో నూతన సమరోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రియాంకగాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. నిన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రియాంక గాంధీ రోడ్ షోలో పాల్గొంది. లక్నో విమానాశ్రయం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించగా అందులో పాల్గొన్న అనేక మంది ఫోన్‌లు దొంగిలించబడ్డాయి. దాదాపు 50 మందికి పైగా ఫోన్‌లు తస్కరించబడ్డాయి. 
 
రోడ్‌షోకి ఎక్కువ మంది గుమిగూడటం వల్ల దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నాయకుల ఫోన్‌లు సైతం చోరీకి గురైయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీషాన్ హైదర్‌ ఫోన్ కూడా దొంగిలించబడడం కొసమెరుపు. దాదాపుగా యాభై మంది నుండి ఫోన్‌లు చోరీకి గురైయ్యాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు దొంగలను పట్టుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు. చోరీ అయిన ఫోన్‌లను రికవర్ చేసుకోవడానికి సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.