మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:48 IST)

ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ఖాతా వైరల్.. నిమిషాల్లో వేల సంఖ్యలో ఫాలోయర్లు...

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెల్లి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఈ ఖాతా ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఆమె ఫాలోయర్ల సంఖ్య వేలల్లో చేరిపోయింది. ఈ ఖాతాను ఆదివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆమె ప్రారంభించగా, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెరిఫైడ్ అకౌంట్‌గా ట్విట్టర్ గుర్తించడం విశేషం. 
 
ఆమెకు ట్విట్టర్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు 15 వేల మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇప్పటివరకైతే ఆమె ఎలాంటి ట్వీట్ చేయలేదు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంకా ట్విట్టర్‌లో అడుగుపెట్టిన విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ మద్దతుదారులు ఆమెను ట్విట్టర్‌లో ఫాలో కావచ్చని ట్వీట్ చేసింది. 
 
సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న సమయంలో కొత్తగా పలువురు ప్రముఖ నేతలు ట్విట్టర్ ఖాతాలను తెరుస్తున్నారు. గత నెలలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ట్విట్టర్‌లో అడుగుపెట్టారు.