దారుణం... బిస్కెట్ తీసుకున్నందుకు బాలుడిని చంపేశాడు...

brutal murder
సందీప్ రేవిళ్ళ| Last Modified మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (20:33 IST)
కిరాణా వస్తువులు కొనుగోలు చేయాలని వచ్చి బిస్కెట్‌ని దొంగిలించాడన్న కారణంతో బాలుడిని దారుణంగా కొట్టి చంపేశారు. బీహార్‌లోని బాంకా జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని బాసుదేవ్‌పూర్ గ్రామంలో సురేఖా మండ‌ల్‌కు కిరాణా దుకాణం ఉంది. ఇక్కడకి 7వ తరగతి చదువుకుంటున్న నితీష్ కుమార్ (14) ఏవో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చాడు.

ఈ నేపథ్యంలో రూ. 5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్‌ని బాలుడు తీస్తూ ఉండగా యజమాని గమనించి పట్టుకున్నాడు. బిస్కెట్ దొంగతనం చేస్తావా అని ఆరోపిస్తూ కొట్టడం ప్రారంభించాడు. దాంతో బాలుడు స్పృహ కోల్పోయాడు. తీవ్ర గాయాలైన నితీష్‌ని చుట్టుప్రక్కల వారు గమనించి జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. తన కుమారుడిని కొట్టడమే కాకుండా విషం కూడా పెట్టారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :