శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (16:05 IST)

రచ్చ చేసిన రజినీకాంత్.. కుమార్తె పెళ్లిలో రప్ఫాడించిన తలైవర్

సూపర్ స్టార్ రజినీకాంత్ రచ్చ చేశారు. అదీకూడా ఏడు పదుల వయస్సులోనూ జోష్ ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించారు. సోమవారం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన తన కుమార్తె సౌందర్య వివాహంలో రజినీకాంత్ డాన్స్ చేస్తూ అతిథులను ఆలరించారు. తాను నటించిన ముత్తు చిత్రంలోని పాటకు రజినీ తనదైన స్టెప్పులతో ఆలరించారు. ఈ స్టెప్పులకు సంబంధించిన చిన్నపాటి వీడియో లీక్ కాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
నిజానికి రజినీకాంత్ బయటకు వస్తే చాలా ప్రశాంతవదనంతో కనిపిస్తారు. ఇతర సినిమా హీరోల్లా ఆయన ప్రవర్తన ఉండదు. అభిమానులు ఎంత రెచ్చగొట్టినా ఆయన మాత్రం నిగ్రహం కోల్పోరు. అంటే, స్టెప్పులు వేసేందుకు ఏమాత్రం సాహసించరు. కానీ, తన కుమార్తె సౌందర్య కోసం చిందేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా "ముత్తు" సినిమాలో 'ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు' పాట‌కు చిందేసి ర‌జినీకాంత్ రప్ఫాడించాడు. 
 
ఆయ‌న డాన్సులు చూసి అక్క‌డున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. పెద్ద‌గా డాన్సుల జోలికి వెళ్ల‌ని ర‌జినీ.. కూతురు పెళ్లి కోసం ఎన‌ర్జీ అంతా కూడ‌గ‌ట్టుకుని స్టెప్పులేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అవుతుంది. ర‌జినీకాంత్ డాన్సులు చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఆయ‌న‌తోపాటు కుటుంబ స‌భ్యులు కూడా డాన్సులు చేశారు. ఇక త‌మిళ ఇండ‌స్ట్రీ కూడా సౌంద‌ర్య పెళ్లిలో సంద‌డి చేశారు.