శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 నవంబరు 2018 (16:12 IST)

ముఖేశ్ ఇంట్లో దాండియా వేడుకలు... సిద్ధమైన నీతా అందానీ

భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ ఏకైక కుమార్తె ఈషా అంబానీ పెళ్లి హడావుడి మొదలైంది. పెళ్లికి ఇంకా 25 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ముకేశ్ ఇంట్లో పెళ్లి సంబురాలు ఊపందుకున్నాయి. వచ్చే నెల 12వ తేదీన ఈషా పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.
 
ప్రముఖ యువ వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్‌ను ఈషా పెళ్లి చేసుకోబోతుంది. గత సెప్టెంబరులో ఇటలీలోని లేక్ కోమోలో ఈషా, ఆనంద్ పిరమాల్ ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ కూడా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరైన ఆ కార్యక్రమం మూడు రోజుల పాటు లేక్ కోమోలో జరిగింది.
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ముఖేశ్ ఇంట్లో దాండియా వేడుకలు జరగనున్నాయట. ఆ వేడుకల కోసం సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్.. దాండియా కోసం రెడీ అయిన నీతా అంబానీ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఈషా మాత్రం చేతితో ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన లెహంగాను వేసుకొని ఫోటోలకు పోజిచ్చింది. ఈషా ఫోటోలను ఈషా పెళ్లి డ్రెస్సుల డిజైనర్ సందీప్ ఖోస్లా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు.